ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో; గుర్తుపట్టారా?
ఈ వార్తాకథనం ఏంటి
హీరోల చిన్నప్పటి ఫోటోలు ఆసక్తిగా ఉంటాయి. పై ఫోటోలోని కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
తెలుగు నటుడు కాకపోయినా అచ్చ తెలుగులో అందంగా మాట్లాడతాడు. అనువాద చిత్రాలే కాకుండా డైరెక్టుగా తెలుగు సినిమాల్లో నటించాడు.
ఈ అబ్బాయికి ఒక అన్న ఉన్నాడు. అన్న కూడా స్టార్ హీరోనే. ఎవర్రా మీరంతా అని ప్రేక్షకులను సరదాగా పలకరించే ఈ హీరో మరెవరో కాదు, కార్తీ.
ఈరోజు కార్తీ పుట్టినరోజు. నేటితో 47వ వడిలోకి అడుగుపెడుతున్నాడు కార్తీ. యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ, ఆ తరువాత వరుసగా తన సినిమాలను తెలుగులో అనువాదం చేసాడు.
Details
జపాన్ సినిమాతో వస్తున్న కార్తీ
తనకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టమని చెప్పే కార్తీకి తెలుగులో అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన నటించిన ఖైదీ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇటీవల పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ.
ప్రస్తుతం జపాన్ అనే కొత్త సినిమాలో కార్తీ నటిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న జపాన్ సినిమాను ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ నిర్మిస్తున్నారు.
తెలుగు నటుడు సునీల్, విజయ్ మిల్టన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.