Page Loader
నేరుగా ఆహాలోకి విడుదల కానున్న హెబ్బాప‌టేల్‌ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా
స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా

నేరుగా ఆహాలోకి విడుదల కానున్న హెబ్బాప‌టేల్‌ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 26, 2023
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బాపటేల్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన తాజా సినిమా నేరుగా ఓటీటీలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేరకు, సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌, ఓటీటీ తదితర వివరాలను చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం ప్రకటించింది. ఈ చిత్రానికి ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ అనే పేరును ఖ‌రారు చేసినట్లు తెలిపింది.అక్టోబ‌ర్ 6న ఆహా ఓటిటిలో మూవీ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మ‌ద‌న‌ప‌ల్లిలోని యథార్థ ఘ‌ట‌న‌ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది.ఓ కుటుంబం ఎందుకు బలవన్మరణాలకు పాల్ప‌డాల‌ని అనుకుంటోంది. మరణించిన వారు మ‌ళ్లీ పుడ‌తార‌ని బాధిత కుటుంబం ఎలా నమ్మింది తదితర విషయాల ఆధారంగా సినిమా రూపొందింది. హెబ్బాప‌టేల్‌తో రామ్ కార్తిక్, న‌రేష్, ప‌విత్రా లోకేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహా ఓటీటీలోకి హెబ్బాప‌టేల్‌ సినిమా