
ఈ వారం సినిమా: ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాలను చూడడానికి ఇప్పుడు థియేటర్ ఒక్కటే ఆప్షన్ కాదు. ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.
వారం వారం కొత్త కంటెంట్ తో ఓటీటీ ఛానల్స్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఓటీటీ వేదికగా ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అవతార్ ద వే ఆఫ్ వాటర్
జేమ్స్ కామెరూన్ సృష్టించిన వెండితెర అద్భుతం అవతార్ ద వే ఆఫ్ వాటర్ జూన్ 2వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటివరకు ఈ సినిమాను ఓటీటీలో డబ్బులు పెట్టి చూసిన వాళ్ళు ఇకనుండి ఉచితంగా చూడవచ్చు.
Details
మళయాలంలో మంచి విజయం సాధించిన సినిమా 2018
విశ్వక్
వేణు ముల్కల దర్శకత్వం వహించిన విశ్వక్ మూవీ జూన్ 2వ తేదీ నుండి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది.
రామబాణం:
గోపీచంద్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీవాసు డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూన్ 3వ తేదీ నుండి సోనీ లివ్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
2018:
రీసెంట్ గా మలయాళ బాక్సాఫీస్ ను షేక్ చేసిన 2018 మూవీ, జూన్ 7వ తేదీ నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుకుంటుంది.