స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్
హీరో నిఖిల్ నుండి స్పై పేరుతో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం హీరో నిఖిల్. ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పాడు. స్పై సినిమాను మొదటి నుండి పాన్ ఇండియన్ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తామని అన్నారు. కాకపోతే అన్ని భాషల్లో అనుకున్న ప్రకారం విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ విషయమై స్పందించిన నిఖిల్, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల ప్రేక్షకులకు సారీ చెప్పాడు.
ఒత్తిళ్ళకు తలొగ్గనంటున్న నిఖిల్
కాంట్రాక్ట్/కంటెంట్ కారణాల వల్ల అన్ని భాషల్లో సరిగ్గా విడుదల చేయలేకపోయామనీ, ఓవర్సీస్ లో 350 తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దయ్యాయని నిఖిల్ అన్నాడు. ఇక ముందు ఇలా జరగదనీ, తర్వాతి సినిమాలను పక్కా ప్లానింగ్ తో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామనీ అన్నాడు. అంతేకాదు, ఎలాంటి ఒత్తిళ్ళు ఎదురైనా కంటెంట్ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని నిఖిల్ చెప్పుకొచ్చాడు. స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా కనిపించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు.అభినవ్ గొమఠం, మార్కాండ్ దేశ్ పాండే, సాన్యా ఠాకూర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా, జూన్ 29న విడుదలైంది.