Page Loader
నితిన్ కొత్త సినిమా పేరు 'తమ్ముడు'.. ఫుల్ ఖుషిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
తమ్ముడి టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా

నితిన్ కొత్త సినిమా పేరు 'తమ్ముడు'.. ఫుల్ ఖుషిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 27, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

1999లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తమ్ముడు' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా వస్తోంది. నితిన్ పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమలో నితిన్ తన కొత్త చిత్రానికి అభిమాన హిరో పవన్ నటించిన మూవీ పేరు పెట్టుకోవడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొత్త చిత్రం 'తమ్ముడు' చిత్రీకరణ ఆదివారం ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత, పవన్ అభిమాని వేణుశ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మరో విశేషం. దిల్ రాజు సంస్థలోనే వేణుశ్రీరామ్ ఓ మై ఫ్రెండ్,మిడిల్ క్లాస్ అబ్బాయి, వకీల్ సాబ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమ్ముడు మూవీ లాంచ్‌పై నితిన్ చేసిన ట్వీట్