Page Loader
Suriya Injury : హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

Suriya Injury : హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలైనట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సూర్యను హూటాహుటిని ఆస్ప్రత్రికి తరలించారు. 'కంగువ' సినిమాలో ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా ఆయన మీద పడటంతో సూర్య భుజానికి గాయమైంది. సూర్యకు గాయం కావడంతో కంగువ షూటింగ్ ను నిలిపివేశారు. సూర్యకు తమిళ్‌తో పాటు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. యాక్షన్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ కంగువ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 షూటింగ్ లో గాయపడ్డ హీరో సూర్య