
హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.
కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇది వరకు ఒక పాట రిలీజైంది. సమయమా అంటూ సాగే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం రెండవ పాట రిలీజ్ కు సమయం వచ్చేసింది. ఈ మేరకు ఒకానొక వీడియోను రిలీజ్ చేసి మరీ గాజుబొమ్మ అనే పాటను రిలీజ్ కాబోతుందని మేకర్స్ వెల్లడి చేసారు. అక్టోబర్ 6వ తేదీన పూర్తి పాట రిలీజ్ కాబోతుందని తెలియజేసారు.
హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించిన ఈ సినిమాను వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
The musical story of #HiNanna gets deeper ♥️
— Vyra Entertainments (@VyraEnts) October 3, 2023
The Soul of #HiNanna - #GaajuBomma striking on October 6th ✨
Ready ah??
Natural🌟 @NameIsNani #MrunalThakur @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts @TSeries @TseriesSouth pic.twitter.com/lmZ8231345