Page Loader
Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది దసరా మూవీతో కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా డిఫెరంట్ జోనర్‌లో క్లాస్ టచ్‌తో 'హాయ్ నాన్న' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. తల్లికి దూరమైన కూతురిని తండ్రి ఎలా పెంచాడు, తన గతం ఏంటి, వాళ్ల లైఫ్‌లోకి మృణాల్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అనిపించేలా ఈ మూవీ ఉండనుంది. తాజాగా హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 29న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్దనున్న గోకుల పార్క్ లో నిర్వహించనున్నారు.

Details

డిసెంబర్ 7న 'హాయ్ నాన్న' రిలీజ్

సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు కొద్దిసేపటికే క్రితమే మూవీ మేకర్స్ ఆనౌన్స్ చేశారు. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ లవర్, ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీకి అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరస్తున్నాడు. డిసెంబర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.