LOADING...
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్.. . రికార్డులు సృష్టిస్తున్న 'అఖండ తాండవం'
బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్.. . రికార్డులు సృష్టిస్తున్న 'అఖండ తాండవం'

Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్.. . రికార్డులు సృష్టిస్తున్న 'అఖండ తాండవం'

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ తాండవం' సినిమా, 'అఖండ'కి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందురోజు ప్రీమియర్ షోలను కూడా ప్రదర్శించారు. ప్రీమియర్ షోలు, తొలి రోజు కలిపి వచ్చిన కలెక్షన్స్, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా నమోదైనట్లు సమాచారం. ఈ రెండు కలిపి సుమారు రూ.59.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

Details

భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు

ఈ విజయంలో భాగంగా, 'అఖండ తాండవం' మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలను ప్రధానంగా ఉంచి ఈ సినిమాను రూపొందించారు. అంతేకాదు, నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా 'అఖండ తాండవం' నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఓటీటీ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, 'అఖండ తాండవం' బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement