ఉస్తాద్ భగత్ సింగ్ కథతో హిందీ చిత్రం, డిటైల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరక్టర్ హరిష్ శంకర్ ఈ మూవీని డైరక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఇదే కథతో హిందీలో ఓ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. అదేంటి ఇక్కడ రిలీజ్ అయ్యి, హిట్ అయ్యాక కదా, అక్కడి రీమేక్ అయ్యేది అంటే.. ఈ సినిమాకు విజయ్ హీరోగా వచ్చిన తేరీ కు రీమేక్ అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాకపోయినా తేరీకు భారీ మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తేరీ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్న తమిళ డైరక్టర్
నిజంగా తేరి చిత్రం ఆరేళ్ల కిందటే పోలీసోడుగా దిల్ రాజు డబ్బింగ్ చేసి వదిలాడు. ఇది తెలుగులో వర్క్‌వుట్ కాలేదు. ఇప్పుడు దాన్నే బోలెడన్ని మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా నిర్మిస్తున్నారు. దబాంగ్ ని గబ్బర్ సింగ్ లా ఎలా అయితే మార్పులు చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అదే విధంగా ఉస్తాద్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు తేరీ చిత్రాన్ని హిందీలో వరుణ్ ధావన్ హీరోగా చేయబోతున్నారు. తమిళంలో చేసిన డైరక్టర్ అట్లీ నిర్మాతగా మారి మరో తమిళ డైరక్టర్ కలీస్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారట. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యే సమయానికి హిందీలో రిలీజ్ అయ్యేలా అట్లీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.