LOADING...
Tollywood: హీరో లేకుండానే హిస్టరీ.. 9 నంది అవార్డులు సాధించిన చిత్రమిదే!
హీరో లేకుండానే హిస్టరీ.. 9 నంది అవార్డులు సాధించిన చిత్రమిదే!

Tollywood: హీరో లేకుండానే హిస్టరీ.. 9 నంది అవార్డులు సాధించిన చిత్రమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన 'కృష్ణవంశీ' ప్రత్యేకత ఏమిటంటే—సినిమా నేపథ్యం ఏదైనా సరే దాని లోతుల్లోకి వెళ్లి భావోద్వేగాలను చూపించగలడు. ఆయన సినిమాలు సంఖ్యలో తక్కువైనా ప్రభావంలో మాత్రం ఎంతో గొప్పవి. ఆ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రానికి కథే అసలు హీరో. అందుకే సంప్రదాయ హీరో ప్రాధాన్యం లేకుండా, లేడీ ఓరియెంటెడ్ శైలికి దగ్గరగా తెరకెక్కించారు. ముఖ్యంగా రాయలసీమలో కరుడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని కృష్ణవంశీ కళ్లకు కట్టినట్టు చూపించారు. తరువాత వచ్చిన అనేక ఫ్యాక్షన్ చిత్రాలకు ఇది ఒక ప్రమాణంగా నిలిచింది.

Details

షూటింగ్ విశేషాలు

1998 ఆగస్టు 12న హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మించిన ఈ చిత్రం, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంది. ప్రకాశ్ రాజ్ అద్భుత నటన ఈ చిత్రంలో నరసింహులు పాత్రలో నటించిన 'ప్రకాష్ రాజ్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటికి 34 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వృద్ధ ఫ్యాక్షనిస్ట్ పాత్రను ఆయన అత్యంత సహజంగా పోషించారు. శరీరంలో బలం తగ్గినా పౌరుషంలో మాత్రం తగ్గుదలలేని పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారు.

Details

సౌందర్య భావోద్వేగ ప్రయాణం

మారిషస్‌లో పెరిగిన భానుమతి అనే యువతి, భారతదేశానికి వచ్చి అనుకోకుండా ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకొని భర్తను కోల్పోతుంది. తన ప్రాణాలు, తన కుమారుడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటాన్ని కృష్ణవంశీ హృద్యంగా తెరకెక్కించారు. ఈ పాత్రలో సహజనటి సౌందర్య తన నటనతో మరింత లోతు తీసుకొచ్చారు. సారాయి వీర్రాజు పాత్ర చిన్నదైనా ప్రభావవంతంగా నిలిచింది. ఈ పాత్రలో జగపతి బాబు అదరగొట్టారు. గాయం చిత్రానికి కృష్ణవంశీ కో-డైరెక్టర్‌గా పని చేసిన అనుబంధంతో, ప్రత్యేక పాత్ర కోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఈ పాత్ర కోసం 20 రోజులు వరుసగా పనిచేసి, మరో సినిమా చేయకుండా పూర్తిగా ఆ పాత్రలో మునిగిపోయారు. షూటింగ్ స్పాట్‌లోనే ఉండి పాత్రను ఒకే మోడ్‌లో కొనసాగించారు

Advertisement

Details

ఇతర నటీనటులు

ప్రకాశ్ రాజ్ కొడుకుగా, సౌందర్య భర్తగా సాయి కుమార్ నటించారు. ఆయన పాత్రకు డైలాగులు తక్కువగా ఉన్నా భావప్రధానంగా సాగింది. ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో ఊర్వశి శారద కనిపించారు. చాలా కాలం విరామం తర్వాత ఆమె నటించిన చిత్రం ఇదే. దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ ఇందులో ప్రకాష్ రాజ్ అనుచరుడిగా నటించారు.

Advertisement

Details

సంగీతం, పాటలు

మాస్ట్రో 'ఇళయరాజా' ఈ చిత్రానికి సంగీతం అందించారు. "చిందేయ్ దరువెయ్యరా సాంబయ్యా", "సూర్యుడి పువ్వా జాబిల్లి గువ్వా", "అసలేం గుర్తుకురాదు" పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. పాటలన్నీ సీతారామశాస్త్రి రచించారు. 'సూర్యుడి పువ్వా' పాటను పాడిన ఎస్. జానకి ఉత్తమ గాయనిగా నంది అవార్డు అందుకున్నారు. 1998 నవంబర్ 30న ఈ చిత్రంవిడుదలైంది. సౌందర్య ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకోగా, ఆమెకు డబ్బింగ్ చెప్పిన సరిత ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గౌరవం పొందారు. జగపతిబాబు ఉత్తమ సహాయ నటుడు, ప్రకాష్ రాజ్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, తెలంగాణ శకుంతల ఉత్తమ సహాయ నటి అవార్డులు అందుకున్నారు.

Advertisement