Page Loader
Hit 3: హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్
హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్

Hit 3: హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం హిట్‌ ప్రాంఛైజీలో భాగమైన హిట్ 3లో నటిస్తున్నాడు. షైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. హిట్ 3 కోసం అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరాడు. ఈ సందర్భంగా మేకర్స్ నాని పాత్రకు సంబంధించి పీక్‌ను రిలీజ్ చేశారు. మంచు పర్వతాల నడుమ కారుతో దూసుకెళ్తున్న హిట్ ఆఫీసర్‌ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిట్ 3 చిత్రం 2025 మే 1న థియేటర్లలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

Details

సంగీతాన్ని అందించనున్న మిక్కీ జె మేయర్

ఈ సందర్భంగా నాని గన్ పట్టుకొని సెల్యూట్ చేస్తున్న కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోమ్ బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, గొడ్డలితో స్టైలిష్ లుక్‌లో కనిపించడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్