HIT 3 Teaser: 'హిట్-3' టీజర్ వచ్చేసింది.. లాఠీ ఝుళిపించిన అర్జున్ సర్కార్.
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ సినిమాల్లో 'హిట్' చిత్రాలకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విజయవంతం కావడంతో, మరో సీక్వెల్‌పై మేకర్స్ దృష్టి సారించారు.
ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను 'హిట్ 3 : ది థర్డ్ కేస్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో నాని హీరోగా నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
వివరాలు
నాని పుట్టినరోజు కానుకగా 'హిట్ 3' టీజర్ విడుదల
ఇటీవల కాలంలో నాని కంటెంట్ పరంగా బెస్ట్ సినిమాలను చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ఆయన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్ 3'లో భాగమవుతున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు గణనీయంగా పెరిగాయి.
ఇందులో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం, దీనివల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటి వరకు మృదువైన ఫ్యామిలీ మాన్ పాత్రలతో ఆకట్టుకున్న నాని, ఈ సినిమాలో పూర్తిగా రెబల్ లుక్‌లో కనిపించబోతుండడం విశేషం.
వివరాలు
పోస్టర్లో నాని గొడ్డలి పట్టుకుని..
కొన్ని రోజుల క్రితం నాని సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'హిట్ 3' సినిమా నుంచి ఒక కీలక అప్డేట్‌ను మేకర్స్ అందించారు.
తాజాగా, ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
విడుదల చేసిన పోస్టర్లో నాని గొడ్డలి పట్టుకుని కనిపించడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. అంతేకాకుండా, ఒక మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు.