గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదు. ఉపాసన డెలివరీ కోసం షూటింగుకు సెలవు చెప్పేసాడు రామ్ చరణ్. ప్రస్తుతం కూతురు బారసాల కూడా పూర్తి చేసి ఫ్రీగా ఉండడంతో ఈరోజు నుండి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నాడని అంటున్నారు. . ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు.మరో పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, గేమ్ ఛేంజర్ లోని కొన్ని సన్నివేశాల కోసం వేరే డైరెక్టర్ వస్తున్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు, హిట్ ఫ్రాంఛైజీల దర్శకుడు శైలేష్ కొలను.
కామెడీ సీన్ల కోసం వచ్చేస్తున్న శైలేష్ కొలను
గేమ్ ఛేంజర్ సినిమాకు సెకండ్ యూనిట్ మెయిన్ డైరెక్టర్ గా శైలేష్ కొలను పనిచేస్తున్నారు. అందువల్ల కొన్ని సీన్లను శైలేష్ కొలను తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తికాగానే, ఈ నెల చివర్లో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని, అందులో రఘుబాబు, రాకెట్ రాఘవ మీద వచ్చే కామెడీ సీన్లకు శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారట. ఇటు గేమ్ ఛేంజర్, అటు ఇండియన్ 2 చిత్రాలతో శంకర్ బిజీగా ఉండడంతో, సమయం వృధా కావద్దన ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారట. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిస్తుండగా, అంజలి, సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.