
Deeksha Seth: స్టార్ హీరోలతో హిట్స్.. ఇప్పుడు లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న హీరోయిన్!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ప్రపంచంలో ప్రతేడాది కొత్త హీరోయిన్‌లు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకుంటే, మరికొందరికి వరుసగా సినిమాలు చేసినా గుర్తింపు రావడం కష్టమే. అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్న హీరోయిన్ మాత్రం చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ కెరీర్ మంచి ఊపులో ఉండగానే సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం నెల జీతం కోసం ఐటీ జాబ్ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తుందా? అదే వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించిన దీక్షా సేత్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి రెబల్ సినిమాలో నటించింది.
Details
అశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు
తెలుగులో వేదంతోనే అపారమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత ప్రభాస్‌తో రెబల్, గోపిచంద్‌తో వాంటెడ్, రవితేజ సరసన నిప్పు, మిరపకాయ్ వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌ల లిస్టులో చోటు సంపాదించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత ఆశించినంతగా అవకాశాలు రాలేదు. 2012లో వచ్చిన ఊ కొడతార ఉలిక్కిపడతారా చిత్రమే ఆమె చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగు ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది.
Details
ఐటీ జాబ్ చేస్తున్న హీరోయిన్
కానీ అక్కడ కూడా ఆశించినంత ఫలితం రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. తర్వాత లండన్‌కు వెళ్లిన దీక్షా సేత్, అక్కడే ఐటీ జాబ్ చేస్తూ స్థిరపడింది. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఐటీ ఉద్యోగంతో జీవితం కొనసాగిస్తోంది. లండన్‌లో స్వంత ఇల్లు కొనుగోలు చేసిన ఆమె, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంది. అప్పట్లో ఎలా గ్లామరస్‌గా మెప్పించిందో, ఇప్పుడు కూడా అలానే హాట్ ఫోజులతో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.