
కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
క్రిస్టియన్ ఒలివర్‌కు సంబంధించిన చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలి కరేబియన్ సముద్రంలో పడిపోయింది.
రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీసులు ఒలివర్ మరణాన్ని ధృవీకరించారు.
తన 30 ఏళ్ల కెరీర్‌లో టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీతో కలిసి నటించిన విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
'ది గుడ్ జర్మన్', 'స్పీడ్ రేసర్'లో సినిమాలు తన కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచాయి.
హాలీవుడ్
నాలుగు మృతదేహాల వెలికితీత
క్రిస్టియన్ ఒలివర్ విమానం సముద్రంలో పడిపోయిన వెంటనే, మత్స్యకారులు, డైవర్లు, కోస్ట్ గార్డ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ తర్వాత అక్కడ నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
51 ఏళ్ల ఒలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మదిత (10 సంవత్సరాలు), అన్నీక్ (12 సంవత్సరాలు), పైలట్ రాబర్ట్ సాచ్స్ ఈ విమాన ప్రమాదంలో మరణించారు.
గురువారం మధ్యాహ్నం గ్రెనడైన్స్‌లోని చిన్న ద్వీపం బెక్వియా నుంచి సెయింట్ లూసియా వైపు తన చిన్న విమానంలో క్రిస్టియన్ ఒలివర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అతను తన కుటుంబంతో కలిసి సెలవులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.