Shruti Haasan: హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. 'ది ఐ' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
శృతి హాసన్ హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న 'ది ఐ' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించగా, వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్‌కు సిద్ధమైంది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో హారర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ సినిమాలను ప్రదర్శించనుండగా, ప్రారంభ చిత్రంగా 'ది ఐ' ప్రీమియర్ కానుంది.
డయానా(శృతి హాసన్) అనే మహిళ తన భర్త ఫెలిక్స్(మార్క్ రౌలీ)కోసం చేసే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
మరణించిన తన భర్తను తిరిగి తెచ్చుకోవడానికి డయానా ఏం చేసింది? ఆమె చేసిన త్యాగాలు ఏమిటి? అన్నది ఈ కథా గమనంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు.
Details
అందమైన లొకేషన్స్‌లో 'ది ఐ' షూటింగ్
గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని అద్భుతమైన లొకేషన్లలో 'ది ఐ' చిత్రీకరణ జరిగింది. ఈ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
అంతేకాకుండా 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది.
సైకలాజికల్ థ్రిల్లర్ తన ఫేవరేట్ జానర్ అని, మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులతో కూడిన చిత్రాలను చేయడాన్ని, చూడడాన్ని తాను ఇష్టపడతానని శృతి హాసన్ తెలిపింది.
'ది ఐ' తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని, ఈ చిత్ర ప్రొడక్షన్ టీమ్ మొత్తం మహిళలేనని తెలిపింది.
Details
కూలీలో హీరోయిన్ గా శృతి హాసన్
'ది ఐ'లో శ్రుతి హాసన్ ఎంతో బలమైన పాత్ర పోషించిందని దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెలిపింది.
ఈ పాత్రలో శృతి విభిన్నమైన ఎమోషన్లను చూపించిందని, ఈ సినిమా షూటింగ్ సమయంలో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ప్రత్యేకమైన విధానాలను అనుసరించామని ఆమె వివరించింది.
హాలీవుడ్ సినిమా కాకుండా, శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక తెలుగులో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'డెకాయిట్' చిత్రంలో తొలుత శృతి హాసన్ హీరోయిన్‌గా అనౌన్స్ కాగా, ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను ప్రధాన కథానాయికగా తీసుకున్నారు.