
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ అశ్విన్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
వసంత్ రవి, విమలారామన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అశ్విన్స్, జూన్ 23న రిలీజైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు కానీ విమర్శకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది.
ప్రస్తుతం ఈ హారర్ మూవీ, ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో విడుదలై ఎక్కువ రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా జులై 20నుండి తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
తరుణ్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో బీవీఎస్ఎన్ ప్రసాద్ రిలీజ్ చేసారు.
Details
అశ్విన్స్ కథ ఏంటంటే?
హీరో అర్జున్(వసంత్ రవి) ఇంకా అతని ఫ్రెండ్స్ కి ఒక అలవాటు ఉంటుంది. దయ్యాలుంటాయని చెప్పుకునే పాత బిల్డింగుల్లోకి వెళ్ళి షూట్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు.
ఆ క్రమంలో లండన్ లో ఒక దయ్యల బిల్డింగ్ ని షూట్ చేయాలని ఆఫర్ వస్తుంది. దాంతో హీరో తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు.
ఆ బిల్డింగ్ లో ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ వల్ల హీరోకు, అతని ఫ్రెండ్స్ కి కలిగిన ఇబ్బందులేమిటి? అసలు ఆర్తి రాజగోపాల్ ఆత్మగా ఎందుకు మారిందనేదే కథ.