Page Loader
సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే? 
ఓటీటీలోకి వచ్చేస్తున్న సామజవరగమన

సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 12, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన మూవీ, జూన్ 29వ తేదీన రిలీజైంది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. మూడవ రోజు నుండి మాత్రం సామజవరగమన వసూళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. హాయిగా నవ్వుకునే కామెడీ అందించిన సామజవరగమన సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. గతకొన్ని రోజులుగా హిట్లు లేక బాధపడుతున్న శ్రీవిష్ణు కు అదిరిపోయే హిట్ సామజవరగమన తో దొరికింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా జులై 22వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుందని వినిపిస్తోంది. ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Details

తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజయ్యే సామజవరగమన 

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సామజవరగమన చిత్రం, థియేటర్లలోకి వచ్చి నెల కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తుండడం సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం భాషల్లోనూ అందుబాటులో ఉంటుందట. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నల కిషోర్, ప్రియ, రాజీవ్ కనకాల నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.