సామజవరగమన రివ్యూ: నవ్వుల్ని పంచే కామెడీ ఎంటర్ టైనర్
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సామజవరగమన చిత్రం జూన్ 29న తేదీన రిలీజ్ అవుతుంది. అయితే చిత్రబృందం, కొన్ని ప్రత్యేక సెంటర్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: థియేటర్లో టిక్కెట్లు అమ్మే వ్యక్తిగా పనిచేసే బాలు(శ్రీవిష్ణు) తొలిప్రేమలో ఓడిపోతాడు. దాంతో, అమ్మాయిలన్నా, ప్రేమన్నా చిరాకు పడతాడు. కానీ అనుకోకుండా సరయు (రెబా మోనికా) జాన్ తో ప్రేమలో పడతాడు. ఇదే టైమ్ లో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి సెటిల్ అవుతుంది. దాంతో బాలు, సరయుల పెళ్ళికి సమస్య వస్తుంది. ఆ సమస్యను ఎలా క్లియర్ చేసుకున్నారనేదే కథ.
గుర్తుండిపోయే నరేష్ పాత్ర
శ్రీవిష్ణు తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. రెబా, శ్రీవిష్ణుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అయ్యంగార్, నరేష్ పాత్రల గురించి. వీరిద్దరూ తమ నటనతో, కామెడీ టైమింగ్ తో సినిమాను మరో మెట్టు ఎక్కించారు. సినిమాలో వీళ్ళ పాత్రలు ఆసక్తిగా ఉంటాయి. వెన్నెల కిషోర్ మెప్పించాడు. రైటర్ గా దర్శకుడిగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ లో బోలెడన్ని నవ్వులు కనిపిస్తాయి. సెకండాఫ్ లో కథను చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లో అయ్యిందేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ బాగుంది. ఓవరాల్ గా నవ్వుతూ బయటకు రావడం ఖాయం.