LOADING...
OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి..
ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి..

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత శుక్రవారం (మే 8) పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా అనేక భాషలకు చెందిన కంటెంట్ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో అదే రోజు విడుదలైన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్లో భయాన్ని రేకెత్తిస్తూ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. క్షుద్రపూజలు, దుష్టశక్తులు, ఆధ్యాత్మిక భయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది.

వివరాలు

క్షుద్రపూజలు, దుష్టశక్తుల మధ్య కథ..

కథ విషయానికి వస్తే.. క్షుద్రపూజలు, దుష్టశక్తుల చుట్టూ తిరిగే ఈ హారర్ కథ రెండు భిన్నమైన కాలరేఖల్లో సాగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సమయంలో అస్తినాపురం అనే గ్రామంలో నిర్వహించిన క్షుద్రపూజలు తప్పుదోవ పట్టడంతో ఓ భయానక శక్తి మేల్కొంటుంది. ఆ దుష్టశక్తి తరతరాల పాటు ఆ గ్రామ ప్రజలను వేధిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుత కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే), ఆమె కుటుంబాన్ని అదే దుష్టశక్తి వెంటాడుతుంది. దాని ప్రభావంతో మార్సెలిన్ హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది.

వివరాలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

అంతేకాకుండా ఆమె పిల్లల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. చివరకు ఆ శాపం నుంచి, ఆ దుష్టశక్తి బారినుంచి తన పిల్లలను మార్సెలిన్ ఎలా రక్షించుకుందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తున్న ఈ చిత్రానికి 'సతన్: ది డార్క్' అనే పేరు. 'సతన్' అంటే 'సైతాన్' అనే అర్థం వస్తుంది. దర్శకుడు మణికందన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో ఐరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement