LOADING...
Spirit: 'స్పిరిట్' సెట్స్ నుంచి హాట్ అప్‌డేట్.. ప్రభాస్ ఎంట్రీ సాంగ్ కోసం భారీ సెట్ రెడీ!
'స్పిరిట్' సెట్స్ నుంచి హాట్ అప్‌డేట్.. ప్రభాస్ ఎంట్రీ సాంగ్ కోసం భారీ సెట్ రెడీ!

Spirit: 'స్పిరిట్' సెట్స్ నుంచి హాట్ అప్‌డేట్.. ప్రభాస్ ఎంట్రీ సాంగ్ కోసం భారీ సెట్ రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌-ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' మొదటి నుంచే అపారమైన అంచనాలను సృష్టించింది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి రా-ఇంటెన్స్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న వంగా, ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన యాక్షన్ డ్రామాలో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారన్న సమాచారం అభిమానుల్లో భారీ హైప్‌ని కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 'స్పిరిట్' కోసం చిత్రబృందం భారీ స్థాయిలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోంది. ఇది కేవలం ఆర్టిఫిషియ‌ల్ సెట్ మాత్రమే కాకుండా, కథలో కీలకంగా వ్యవహరించే ప్రధాన లొకేషన్‌గా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Details

సందీప్ వంగా సినిమాల్లో హీరో ఎంట్రీలకు ప్రత్యేక క్రేజ్

సందీప్ వంగా సినిమాల్లో హీరో ఎంట్రీలకు ప్రత్యేక క్రేజ్ ఉండే సంగతి తెలిసిందే. అదే స్టైల్‌ను మరింత ఎలివేట్ చేస్తూ, ప్రభాస్‌కు ఈ సెట్‌లోనే మైండ్-బ్లోయింగ్ పవర్‌ఫుల్ ఎంట్రీను ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు... ఇదే సెట్లో ప్రభాస్ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ను కూడా చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ పాటతో పాటు భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్‌లు కూడా ఇక్కడే తెరకెక్కనున్నట్లు టాక్. వంగా స్టైల్‌కు చిహ్నమైన రా ఎనర్జీ, ఇంటెన్సిటీ, మాస్ మేనరిజం అన్ని కలిసి ఈ సన్నివేశాలను మరింత హైప్‌ను పెంచాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు.

Details

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్

ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం, ప్రభాస్ ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని విధంగా వైల్డ్, అగ్రెసివ్, రా పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ పాత్రలో డార్క్ షేడ్స్‌తో పాటు భారీ ఇంటెన్సిటీ కనిపించనుందట. సెట్ డిజైన్ నుంచి లైటింగ్ వరకూ మొత్తం లుక్‌ను గట్టిగా, రియలిస్టిక్ టోన్‌లో తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌లో 'స్పిరిట్' పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పటికీ, ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రభాస్-వంగా కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు గట్టి ఎమోషన్, వైలెన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమాను ఆశిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలో ప్రభాస్ ఎలా అలరిస్తాడన్నది అందరిలోనూ మంచి కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.

Advertisement