Daggubati Family Case: హోటల్ కూల్చివేత.. వెంకటేశ్, సురేష్, రానాలపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానాలపై కేసు నమోదైంది.
ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసిన వివాదంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టు ఆదేశాల పరంగా ఈ కూల్చివేత జరిగిందని, 448, 452, 458, 120బి సెక్షన్లలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
డెక్కన్ కిచెన్ హోటల్ లీజు విషయంలో నందకుమార్ అనే వ్యాపారి, దగ్గుబాటి కుటుంబంతో గొడవ పడిన సంగతి తెలిసిందే.
ఫిలిం నగర్‌లోని వెంకటేశ్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు.
Details
కోర్టుకెళ్లిన నందకుమార్
లీజు విషయంలో విభేదాలు రావడంతో నందకుమార్ కోర్టుకు వెళ్లారు.
అయితే లీజు విషయంలో కోర్టు ఆదేశాలున్నా అక్రమంగా హోటల్ నిర్మాణాన్ని కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కూల్చివేత వల్ల రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని వాపోయారు.
కోర్టు సూచన మేరకు పోలీసులు దగ్గుబాటి కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
దగ్గుబాటి కుటుంబం తెలిపిన ప్రకారం, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో 1000 గజాల స్థలాన్ని ఆరేళ్ల క్రితం నందకుమార్ లీజుకు తీసుకున్నారు.
అక్కడ ఆయన డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలంపై కూడా నందకుమార్ లీజు తీసుకుని నిర్మాణాలు చేపట్టాడు.
Details
గతంలో నందకుమార్ పై రెండు కేసులు
దీంతో లీజు పూర్తయిన రానా స్థలంపై నందకుమార్ నిర్మాణాలు చేయడంతో ఫిర్యాదు జరిపిన రానా, జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి కూల్చివేశారు.
ఈ కూల్చివేతను ప్రతిఘటించడానికి, దగ్గుబాటి కుటుంబం 60 మంది బౌన్సర్లతో రెస్టారెంట్‌ను కూల్చివేశారని నందకుమార్ ఆరోపించారు.
ఈ వివాదం మీద నందకుమార్ పై కూడా రెండు కేసులు నమోదయ్యాయి.