Page Loader
War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..! 
War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..!

War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2024
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

హృతిక్ రోషన్ చిత్రం'వార్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 'వార్' 2019 సంవత్సరంలో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నవిషయం తెలిసిందే. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'దేవర' షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేపటి (ఏప్రిల్ 12) నుంచి ఎన్టీఆర్ వార్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Details 

జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది? 

ఈ సినిమా షూటింగ్ ముంబైలోని యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో 10 రోజులు జరగనుంది. ఈ షెడ్యూల్ లో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇది స్పై థ్రిల్లర్ చిత్రం. దీనికి సంబంధించిన చాలా సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి పూర్తిగా వెల్లడించలేదు.ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమాలో రా ఏజెంట్ గా ఎన్టీఆర్ నటించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గ్రే షేడ్‌లో ఉంటుందని అంటున్నారు.కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.