Page Loader
Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌-హోంబలే కలయిక.. ఇండియన్‌ సినిమా మరో స్థాయికి!
హృతిక్‌ రోషన్‌-హోంబలే కలయిక.. ఇండియన్‌ సినిమా మరో స్థాయికి!

Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌-హోంబలే కలయిక.. ఇండియన్‌ సినిమా మరో స్థాయికి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినిమా రంగంలో గ్లోబల్ స్థాయిలో హైప్ క్రియేట్ చేసే కలయిక శుక్రవారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన హోంబలే ఫిల్మ్స్‌ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ కోసం చేతులు కలిపారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ కిరగందూర్‌ స్పందిస్తూ ఈ కలయికపై మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ప్రేక్షకుల హృదయాలను తాకే కథలతో సరిహద్దులను దాటి వెళ్లాలన్న లక్ష్యంతో హోంబలే ఫిల్మ్స్‌ పనిచేస్తోంది. హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్‌తో కలిసి పనిచేయడం మాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాం.

Details

ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్‌ :  హృతిక్‌ రోషన్‌

ఈ ప్రాజెక్ట్‌ ఊహాతీతమైన అనుభూతిని అందించేలా రూపొందించామని తెలిపారు. ఇక హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతూ హోంబలే ఫిల్మ్స్‌ ఇటీవల కాలంలో ఎంతో వైవిధ్యభరితమైన కథలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడు వారితో కలిసి పని చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. మా కలలను ప్రేక్షకులకు అద్భుత అనుభూతిగా మార్చేందుకు కృషి చేస్తాం. ఇది నాకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌ అని చెప్పారు. 'కేజీఎఫ్‌' చాప్టర్‌ 1, 2, 'సలార్‌: పార్ట్‌ 1 - సీస్‌ఫైర్‌', 'కాంతార' లాంటి మేజర్‌ బ్లాక్‌బస్టర్‌లతో హోంబలే ఫిల్మ్స్‌ ఇప్పటికే ఇండియన్‌ సినిమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ బేనర్‌ విభిన్న కథా బలం, విజువల్‌ గ్రాండర్‌ విషయంలో ప్రఖ్యాతి పొందింది.