War 2: 'వార్ 2'.. సినిమాపై రైటర్ అప్‌డేట్.. విడుదల తేదీ ఎప్పుడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వార్ 2'.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్నఈ స్పై థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా,ఈ చిత్రంపై రచయిత అబ్బాస్ ఒక కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు.
'''వార్ 2' షూటింగ్ దాదాపు పూర్తయింది.ఈ సినిమా ఆగస్టు 25న విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆ రోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను థియేటర్లలో కలుద్దాం.'వార్ 2'కు అన్ని డైలాగులు నేనే రాశాను.
ఇక షారుక్ ఖాన్,సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో మరో సినిమా త్వరలో ప్రారంభం కానుంది.
అదేవిధంగా 'పఠాన్ 2' కూడా రూపొందుతోంది.వీటికి సంబంధించిన రచనా పనిలో నేను భాగస్వామి అవుతున్నాను.
వివరాలు
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో చిత్రం
ఈ చిత్రాల డైలాగులు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను'' అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన 'వార్' అనే స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
ఇప్పుడు, దానికి కొనసాగింపుగా 'వార్ 2' తెరకెక్కుతోంది.బాలీవుడ్ సమాచారం ప్రకారం,ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లు ఏజెంట్ పాత్రల్లో నటించి మంచి విజయాలు సాధించారు.
అయితే, ఎన్టీఆర్ పాత్ర వీటన్నింటికంటే భిన్నంగా ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో భారీ చిత్రంలో భాగం కానున్నారు.