WAR 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో.. 'వార్ 2' విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'వార్ 2' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'వార్' బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'వార్ 2' రాబోతోంది. హృతిక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇతర ఏజెంట్ క్యారెక్టర్ల కంటే పూర్తి భిన్నంగా ఉండనుంది.
ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌ను ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం.
Details
ఆగస్టు 14న విడుదల!
తాజాగా 'వార్ 2' రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
దీంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఓ విజువల్ ట్రీట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు పవర్‌ఫుల్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఫ్యాన్స్ 'వార్ 2' కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేసారు.
ఇక ఎన్టీఆర్, హృతిక్ లు స్క్రీన్‌పై ఏ స్థాయిలో రచ్చచేస్తారో చూడాలి.