Hrithik Roshan: చేతికర్రతో కనిపించిన హృతిక్.. అసలు కారణం చెప్పిన నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల జరిగిన ఓ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్ చేతికర్ర (ఎల్బో క్రచెస్) సాయంతో నడుస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు బయటకు రావడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రచారానికి స్వయంగా హృతిక్ స్పందిస్తూ తనకు ఎలాంటి తీవ్రమైన సమస్యలేదని స్పష్టం చేశారు. ఎడమ మోకాలి వద్ద స్వల్ప ఇబ్బంది రావడంతోనే తాను చేతికర్ర సహాయంతో నడిచానని హృతిక్ తెలిపారు. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆన్, ఆఫ్ బటన్లు ఉన్నట్టే ఉంటాయేమో.. నా ఎడమ మోకాలు ఒక్కసారిగా ఆఫ్ అయింది. కానీ భయపడాల్సిన అవసరం లేదు.
Details
ఎలాంటి గాయం జరగలేదు
ప్రస్తుతం అంతా బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా కొన్ని సార్లు ఎదురైంది. నడవడానికి సౌకర్యంగా ఉంటుందని మాత్రమే చేతికర్రను ఉపయోగించానని ఆయన వివరించారు. హృతిక్ వివరణతో ఆయనకు ఎలాంటి గాయం జరగలేదని స్పష్టమవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. హృతిక్ 2025లో 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన 'క్రిష్ 4' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. 'క్రిష్' సిరీస్‌లోని గత భాగాలు 2003, 2006, 2013 సంవత్సరాల్లో విడుదలై భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.