Chhaava: రూ.500 కోట్ల క్లబ్‌లో 'ఛావా'.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' సినిమా రికార్డులను బద్దలుగొడుతోంది.
శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి, అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లను సాధించింది.
తాజాగా ఈ చిత్రం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు 'ఛావా' రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ హిస్టారికల్ మూవీ ప్రజల హృదయాలను హత్తుకుంది.
కేవలం 22 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును అధిగమించిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.502 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించారు.
Details
తెలుగులోనూ 'ఛావా' హవా!
హిస్టారికల్ మూవీగా బాలీవుడ్ చరిత్రలో ఇంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే మొదటిదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీ టౌన్‌లో ఘన విజయం సాధించిన 'ఛావా' తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చి అక్కడ కూడా దూసుకెళ్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను మార్చి 7న తెలుగు అనువాదంలో విడుదల చేసింది.
విడుదలైన తొలి రోజే తెలుగు వెర్షన్‌కు మంచి స్పందన వచ్చింది. తొలి రోజునే రూ.3 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా, రష్మిక మందన్నా యేసుబాయి భోంస్లే పాత్రలో నటించారు.
ఇద్దరూ తమ పాత్రల్లో జీవించిపోయారనే ప్రశంసలు పొందుతున్నారు.