Page Loader
Sankranthi Movies Telugu: ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే భారీ చిత్రాలివే!
ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే భారీ చిత్రాలివే!

Sankranthi Movies Telugu: ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే భారీ చిత్రాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా, సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు టికెట్ల కోసం బిజీగా ఉంటే, తెలుగు సినీ పరిశ్రమ సరికొత్త చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు అనేక చిత్రాలు విడుదల కానున్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి సంబరాలకు తొలి చిత్రం. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. రామ్‌చరణ్ ఈ చిత్రంలో మూడు విభిన్న గెటప్పులతో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Details

'డాకు మహారాజ్‌' మాస్ యాక్షన్ థ్రిల్లర్ 

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'డాకు మహారాజ్‌' కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలకృష్ణ పాత్ర పట్ల ఆసక్తి నెలకొంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల అవుతుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' యాక్షన్+ఎంటర్‌టైన్‌మెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ ఒక పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కుటుంబ కథలో క్రైమ్ అంశాన్ని కూడా ఈ చిత్రం ఆవిష్కరించనుంది. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Details

 ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు 

1. నెట్‌ఫ్లిక్స్‌ బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్‌) - జనవరి 10 లెజెండ్‌ ఆఫ్‌ ఫ్లఫ్పీ (స్టాండప్ కామెడీ షో) - జనవరి 07 జెర్రీ స్ప్రింగర్ (డాక్యుమెంటరీ) - జనవరి 07 ది అన్‌షాప్‌ 6 (వెబ్‌సిరీస్‌) - జనవరి 09 గూస్‌బంప్స్ (వెబ్‌సిరీస్‌) - జనవరి 10 2. జీ5 సబర్మతి రిపోర్ట్ (హిందీ) - జనవరి 10 3. అమెజాన్ ప్రైమ్‌ ఫోకస్ (హాలీవుడ్‌) జనవరి 10 4. జియో సినిమా రోడీస్ డబుల్ క్రాస్ (రియాల్టీ షో) - జనవరి 11 5. సోనీలివ్‌ షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాల్టీ షో) - జనవరి 06