Page Loader
Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్!
సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్!

Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'శుభం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో సమంత నిర్మించిన ఈ చిత్రం రూ.7 కోట్ల వసూళ్లను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రానుంది. జూన్ 13 నుంచి 'జియో సినిమాస్ హాట్‌స్టార్' ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ డిజిటల్ హక్కుల కోసం జియో హాట్‌స్టార్ పెద్ద మొత్తాన్ని వెచ్చించింది.

Details

డిజిటల్ హక్కుల డీల్ డీటెయిల్స్

'శుభం' సినిమా మే 9న థియేటర్లలో విడుదలై సమ్మర్ సీజన్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో శ్రీ విష్ణు నటించిన మరో సినిమా విడుదల కావడంతో స్టార్ట్ కాస్త నెమ్మదిగా ఉన్నా, క్రమంగా పుంజుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రాథమికంగా జీ5తో ఓటీటీ ఒప్పందం కుదరినప్పటికీ, చిత్రం విజయం సాధించడంతో ఆ డీల్ రద్దయింది. ఆ తర్వాత జియో హాట్‌స్టార్ రూ.3 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇది చిన్న బడ్జెట్ సినిమాకు పెద్ద డీల్‌గా చెప్పవచ్చు.

Details

సినిమా విశేషాలు...

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన 'శుభం'లో పెద్దగా పేరున్న నటీనటులు లేకపోయినా, కథే సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యింది. హారర్, కామెడీ మిశ్రమంగా సాగే ఈ సినిమా ప్రధానంగా టీవీ సీరియల్స్‌పై వ్యంగ్యంగా రూపుదిద్దుకుంది. టీవీ సీరియల్స్ ఎలా ఎన్నాళ్లకైనా సాగుతాయో, అలాంటి ఓ సీరియల్‌ను రెగ్యులర్‌గా చూస్తూ, ఆఖరికి అది పూర్తికాకముందే చనిపోయిన వారు, ఆత్మలుగా తిరిగి వచ్చి అదే సీరియల్‌ని చూసేట్లు ఉంటే ఎలా ఉంటుందనేది కథ యొక్క ప్రణాళిక. మూడు యువ జంటల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ వినోదాత్మకంగా సాగుతుంది.

Details

జూన్ 13 నుంచి స్ట్రీమింగ్

సీరియల్స్‌లో కనిపించే స్త్రీల అణచివేత, పురుషాధిక్యత లాంటి అంశాలను చాలా సున్నితంగా, వివాదానికి తావు లేకుండా కథలో మిళితం చేశారు. ఈ సినిమాలో సమంత కూడా ఒక గెస్ట్ రోల్ చేసింది. నిర్మాతగా మాత్రమే కాకుండా, ప్రమోషన్ల పరంగానూ సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లింది. తొలి సినిమాతోనే సమంత భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా, ఓటీటీ డీల్ రూపంలో మంచి లాభాలు పొందగలిగింది. ఈ జూన్ 13 నుంచి ప్రేక్షకులు 'శుభం' సినిమాను హాట్‌స్టార్‌లో చూసి ఆస్వాదించవచ్చు.