Page Loader
తెలుగులో సూర్య మార్కెట్ పదిలం: డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు అభిమానుల హంగామా 
తెలుగులో మళ్ళీ విడుదలైన సూర్య సన్నాఫ్ క్రిష్ణన్

తెలుగులో సూర్య మార్కెట్ పదిలం: డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు అభిమానుల హంగామా 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 04, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య నటించిన సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ సినిమా మళ్ళీ విడుదలైంది. ఈ సినిమా రీ రిలీజ్ కు భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోతుంది. డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు ఇంత భారీగా స్థాయిలో రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైదరాబాద్ లో కొన్ని చోట్ల సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ షోస్ నిండిపోయాయని సమచారం. గత కొన్నేళ్ళుగా తెలుగులో థియేటర్లో కనిపించని సూర్యకు మార్కెట్ ఇంకా పదిలంగానే ఉందని సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ నిరూపిస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూర్య సన్నాఫ్ క్రిష్ణ రీ రిలీజ్ లో అభిమానుల హంగామా