తదుపరి వార్తా కథనం
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో.. అల్లు అర్జున్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 03, 2025
09:39 am
ఈ వార్తాకథనం ఏంటి
సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పై నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ గురించి తీర్పు కాసేపట్లో వెలువడనుంది.
ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును నేటి రోజుకు వాయిదా వేసింది.
'పుష్ప 2' చిత్ర బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో,అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి,అరెస్ట్ చేశారు.
నాంపల్లి కోర్టు ఆయన్ని రిమాండ్‌కు పంపించడంతో,పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.
అయితే,హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు.
మరోవైపు, నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ పూర్తవడంతో, అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు హాజరయ్యారు. ఆ రోజునే, ఆయన తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.