Page Loader
ASHOK SARAF:'హమ్ పాంచ్' నటుడు అశోక్ సరఫ్‌కు పద్మశ్రీ అవార్డు 
'హమ్ పాంచ్' నటుడు అశోక్ సరఫ్‌కు పద్మశ్రీ అవార్డు

ASHOK SARAF:'హమ్ పాంచ్' నటుడు అశోక్ సరఫ్‌కు పద్మశ్రీ అవార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినిమాలో ఎందరో కళాకారులు పనిచేశారు. తమ పాత్రలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి నటులలో అశోక్ సరఫ్ ఒకరు. అశోక్ 4 దశాబ్దాలకు పైగా మరాఠీ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటించారు. ఈ స మ యంలో డిఫ రెంట్ క్యారెక్ట ర్స్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఎంట ర్ టైన్ చేస్తూ.. సీరియ స్ రోల్స్ తో ఫ్యాన్స్ ని ఎమోష న ల్ గా కూడా చేశారు. అశోక్ సరఫ్ సినీ పరిశ్రమలో చేసిన ప్రశంసనీయమైన కృషికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు.

వివరాలు 

బాలీవుడ్ చిత్రాలలో బహుముఖ పాత్రలు 

భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంపై నటుడు అశోక్ సరాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర భూషణ్ తర్వాత రెండవ పద్మశ్రీ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అశోక్ సరాఫ్ తన కెరీర్‌లో చాలా సినిమాలు చేశాడు. అయన దామద్, ఫుల్వారీ, ముద్దత్, శివశక్తి, ఘర్ ఘర్ కి కహానీ, ఆ గలే లాగ్ జా, కరణ్ అర్జున్, గుడ్డు, కోయెలా, యస్ బాస్, ఖూబ్‌సూరత్, బంధన్, జోరు కా గులాం, ఇత్తేఫాక్, ఇంతేకామ్, సింగం, వేద్ చిత్రాలలో పనిచేశారు. అయన బాలీవుడ్ చిత్రాలలో బహుముఖ పాత్రలు పోషించాడు. ప్రజలను మెప్పించడంలో విజయం సాధించాడు. 77 ఏళ్ల వయసులో మరాఠీ థియేటర్‌లో కూడా ఔరా అనిపించాడు.