
Huma Qureshi: ప్రియుడితో హుమా ఖురేషి ఎంగేజ్‌మెంట్.. 40 ఏళ్ల వయసులో సర్‌ప్రైజ్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల సంఖ్య ఎక్కువే. వారిలో కొందరు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా పాపులారిటీ పొందిన వారిలో హుమా ఖురేషి (Huma Qureshi) కూడా ఒకరు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలలోనూ మెరిసిన ఈ బ్యూటీ తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అందాల భామ పెళ్లి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, నటి హుమా ఖురేషి తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్ సింగ్ (Rachit Singh)తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రచిత్ సింగ్ ఒక యాక్టింగ్ కోచ్ కాగా, హుమాతో ఆయన దాదాపు సంవత్సరం నుంచి డేటింగ్‌లో ఉన్నారని వార్తలు చెబుతున్నాయి.
Details
గతంలో శిఖర్ ధావన్ తో రిలేషన్ ఉన్నట్లు వార్తలు
యాక్టింగ్ కోచింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ తర్వాత అనుబంధం మరింత బలపడిందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న హుమా ఖురేషి గతంలో క్రికెటర్ శిఖర్ ధావన్‌తో రిలేషన్‌లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె నిజమైన బాయ్‌ఫ్రెండ్ రచిత్ సింగ్ అని, త్వరలోనే అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.