Page Loader
Nayanathara: నయనతారకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చిన భర్త విఘ్నేష్.. బర్త్‌డే గిఫ్ట్‌గా కాస్ట్ లీ కార్ 
నయనతారకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చిన భర్త విఘ్నేష్.. బర్త్‌డే గిఫ్ట్‌గా కాస్ట్ లీ కార్

Nayanathara: నయనతారకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చిన భర్త విఘ్నేష్.. బర్త్‌డే గిఫ్ట్‌గా కాస్ట్ లీ కార్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. నయన్ ఇటీవలే 39వ ఏటలోకి అడుగుపెట్టింది. నయనతారకు విఘ్నేష్ లగ్జరీ 'మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్‌' (Mercedes Maybach) కారును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. పాపులర్ వెహికల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భర్తకు ధన్యవాదాలు అంటూ పోస్టు చేసింది. కొత్త మెర్సిడెస్ మేబ్యాక్‌ కారుకు వెల్‌కమ్ చెబుతూ రెండు నయన్ రెండు ఫోటోలను షేర్ చేసింది.

Details

నయనతారకు కాంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్

వాస్తవానికి కారు మోడల్ ఏంటనేది చెప్పలేదు. ఇక ఫోటోలో కనిపించిన లోగోను చూస్తే అది మెర్సిడెస్ మే బ్యాక్ సెడాన్ అని తెలిసింది. ఈ కారు ధర రూ.2.69 కోట్లు నుంచి మొదలవుతుంది. అయితే ఈ ఎడిషన్‌లో టాప్ ఎండ్ కారు ధర రూ. 3.40 కోట్ల వరకు ఉంది. ఇక నయన్ పోస్టుకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నయనతార, దర్శకుడు విఘ్నేష్ దంపతులు ఇద్దరూ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.