
Salman Khan: నాకూ మద్దతు కావాలి.. బాలీవుడ్‌పై సల్మాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికందర్' (Sikandar) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ నటీనటుల నుంచి ఆశించిన విధంగా మద్దతు లేకపోవడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ తరచుగా ఇతర స్టార్స్ సినిమాలకు ప్రమోషన్ చేస్తూ ఉంటారు. కానీ, 'సికందర్'పై మాత్రం బాలీవుడ్ ప్రముఖులు మౌనం పాటించారని అభిమానులు పేర్కొంటున్నారు.
తాజాగా ఈ అంశంపై సల్మాన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బహుశా బాలీవుడ్ లో ఉన్నవాళ్లు నాకు ఎవరి మద్దతు అవసరం లేదనుకున్నారేమో. కానీ ప్రతి మనిషికి సపోర్ట్ కావాలి. నాకూ మద్దతు అవసరమేనని అన్నారు.
ఈ ఇంటర్వ్యూలోని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .
Details
సికిందర్ కు మిశ్రమ స్పందన
'సికందర్' రిలీజ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, సన్నీదేవోల్ మాత్రమే దీనిపై స్పందించారు.
సన్నీదేవోల్ సినిమా విజయం సాధించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో కలిసి ఆమిర్‌ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
కానీ వీరిని తప్ప, మిగిలిన బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు. అలాగే తన పనిపై నిబద్ధత లేదంటూ వచ్చిన కథనాలపై కూడా సల్మాన్ స్పందించారు.
''సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను భాగమవుతాను. నిబద్ధత లేకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదని పేర్కొన్నారు. కాగా, 'సికందర్' సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.