LOADING...
Chiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి
ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి

Chiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ఉమెన్స్‌ పేరుతో విడుదలైన స్పెషల్‌ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులు పాల్గొన్నారు అమ్మ నన్ను చూసి మా అబ్బాయి కాదంది చిరంజీవి తన చిన్ననాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంట్లో అందరిలోనూ తాను చలాకీగా ఉండేవాడినని చెప్పారు. మూడు సంవత్సరాల వయసులో ఒకసారి ఇంట్లో నుండి బయటకు వచ్చి, ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఒకాయన తన కొలిమిలోకి తీసుకువెళ్లారని తెలిపారు.

Details

చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని

ఇంట్లో వాళ్లకు కబురు చేయడంతో, అమ్మ అంజనాదేవి వచ్చి చూడగానే, తనను గుర్తుపట్టలేకపోయిందని, "వీడు మా అబ్బాయి కాదని అన్నారని చిరంజీవి నవ్వుతూ గుర్తు చేశారు. కానీ కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చి మళ్లీ చూడగా, నిజంగా తన కుమారుడేనని గుర్తించి ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు. తాను చాలా అల్లరి చేసే వాడినని, అందుకే అమ్మ తనను అప్పట్లో తాళ్లతో కూడా కట్టేసిందని చిరు గుర్తుచేసుకున్నారు.

Details

పవన్‌ కళ్యాణ్ స్పెషల్‌ కిడ్‌ 

నాగబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ చిన్నప్పటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. "మా ఇంట్లో పవన్‌ కల్యాణ్‌ స్పెషల్‌ కిడ్‌. చిన్నప్పటి నుంచి తను తినే అలవాటు పెద్దగా ఉండేది కాదు. దాంతో అమ్మానాన్న ఆయనను ప్రత్యేకంగా చూసుకునే వాళ్లు. అమ్మ తనకు నచ్చిన ఫుడ్‌ వండటానికి ఎక్కువ శ్రద్ధ పెట్టేదని నాగబాబు తెలిపారు. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి:చిరంజీవి తల్లి అంజనాదేవి గురించి మాట్లాడుతూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. "మా అమ్మకు మొత్తం ఐదుగురు బిడ్డలం. కానీ మరో ముగ్గురు చిన్న వయస్సులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా బిజీగా ఉండేవారు. ఇంట్లో అన్నీ బాధ్యతలు అమ్మే చూసుకునేవారు. తాను చిన్నప్పటి నుంచే అమ్మకు సాయం చేయడానికి ప్రయత్నించేవాడినని తెలిపారు.

Details

సోదరి అనారోగ్యంతో మృతి

తాను ఆరో తరగతి చదువుతుండగా రమ అనే నా సోదరి అనారోగ్యంతో బాధపడింది. అమ్మతో కలిసి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ, తను రెండు రోజులకు చనిపోయింది. ఆమెను చేతుల్లో ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చాను. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేశారు. మా నాన్నకు ఆ వార్త తెలిసేసరికి అంతా ముగిసిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. తలచుకుంటే ఎంతో బాధగా అనిపిస్తుందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.