Loading...
Nithya Menon: యంత్రంలా పనిచేయలేను.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
యంత్రంలా పనిచేయలేను.. విరామంపై నిత్యా మేనన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Nithya Menon: యంత్రంలా పనిచేయలేను.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్నమైన ప్రేమకథలను ఎంచుకుంటూ, గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు అందాల తార నిత్యా మీనన్‌. ప్రస్తుతం ఆమె 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మేనన్‌.. నటిగా సినిమాల నుంచి తాను విరామం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. జీవితమంటే కేవలం సినిమాలు మాత్రమే కాదని, వాటికి మించిన ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

వివరాలు

విరామం నాకు చాలా అవసరం

నా దృష్టిలో జీవితం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు. వాటికి మించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి.

పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటాను.

ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకుంటాను. తరచూ కొంతమంది నన్ను సినిమాలకు ఎందుకింత విరామం తీసుకుంటున్నావని అడుగుతుంటారు.

అందుకే ఎవరడిగినా ఆ విరామం నాకు అవసరమని చెబుతుంటాను. నిజమైన పువ్వు తన పరిసరాల నుంచి ఎన్నో విషయాలను గ్రహిస్తుంది.

నేను కూడా అంతే. యంత్రంలా నిరంతరం పనిచేయలేను. కృత్రిమంగా నటించలేను.

వివరాలు

కొంత సమయం కావాలి

పాత్రల్లోని భావోద్వేగాలు నా అంతరాత్మ నుంచి రావాలి.

అలా కాకపోతే ఎలా నటించగలను? తెరపై బాగా కనిపించేందుకు ఎంతో సన్నాహాలు చేస్తాను.

అందుకే కోలుకోవడానికి, తిరిగి శక్తిని పుంజుకోవడానికి నాకు కొంత సమయం కావాలని నిత్యా మేనన్‌ వివరించారు.

ADVERTISEMENT