LOADING...
Shilpa Shirodkar: ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు.. 'జటాధర'తో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన శిల్పా శిరోధ్కర్
ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు.. 'జటాధర'తో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన శిల్పా శిరోధ్కర్

Shilpa Shirodkar: ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు.. 'జటాధర'తో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన శిల్పా శిరోధ్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్‌-ఇండియా సినిమా 'జటాధర' నవంబర్‌ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఆమె సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శిల్పా మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం వచ్చిన 'బ్రహ్మ' తర్వాత మళ్లీ తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను 'శోభ' అనే పాత్రలో కనిపిస్తాను. డబ్బుపై విపరీతమైన ఆశ, ఏవిధంగానైనా ధనవంతురాలు కావాలనే తపన కలిగిన స్త్రీ పాత్ర ఇది.

Details

సుధీర్ బాబు చాలా అంకితభావంతో పనిచేస్తారు

ఇంతకు ముందు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. అందుకే ఇది నాకు చాలాసవాల్‌గా అనిపించింది. దర్శకుల స్పష్టమైన విజన్‌ వల్ల ఈ పాత్రను నమ్మకంగా చేయగలిగాను. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హీరో సుధీర్ బాబు గురించి మాట్లాడుతూ ఆయనతో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఈ తరం నటుల నుంచి నేర్చుకోవాల్సినది చాలా ఉంది. సుధీర్ బాబు చాలా అంకితభావంతో పనిచేస్తారు. ఆయన మాకు బంధువు అయినప్పటికీ, సెట్లో మేమిద్దరం పూర్తిగా ప్రొఫెషనల్‌గా నటులుగానే ఉన్నామని తెలిపారు. అలాగే మా ట్రైలర్‌ను మహేశ్ బాబు విడుదల చేయడం, ఇండస్ట్రీకి తిరిగి స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.

Details

అత్యుత్తమ దశలో టాలీవుడ్

తన పూర్వ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ 'బ్రహ్మ' సినిమా సమయంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటెంట్‌, టెక్నికల్‌ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం టాలీవుడ్‌ అత్యుత్తమ దశలో ఉందని అభిప్రాయపడ్డారు. 'జటాధర' సినిమా గురించి వివరించుతూ,ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్‌, బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని అందిస్తుంది. ఇది ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ, దానిలో హృదయాన్ని తాకే కథ ఉందని శిల్పా హామీ ఇచ్చారు. దర్శకులు వెంకట్‌, అభిషేక్‌ల ప్రతిభను ప్రశంసిస్తూ, వారికి నటీనటుల నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసు. నిర్మాతలు కూడా ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమాను తీర్చిదిద్దారన్నారు.