Honey Singh: 'షారుక్‌తో నాకు ఎలాంటి వివాదం లేదు'.. తొమ్మిదేళ్ల తర్వాత స్పందించిన హనీ సింగ్!
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, సింగర్ హనీ సింగ్ మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హనీ సింగ్ ఈ వివాదంపై స్పందించారు. 'యో యో హనీసింగ్: ఫేమస్' డాక్యుమెంటరీలో ఆయన ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. అప్పట్లో వచ్చిన వార్తలకు తాను బాధపడినట్లు చెప్పారు. అమెరికా టూర్‌లో తమ మధ్య గొడవ జరిగిందని కొంతకాలంగా వదంతులు వ్యాపించాయన్నారు. కానీ ఈ విషయం గురించి ఇప్పుడు నిజాన్ని చెబుతున్నానని, షారుక్ ఖాన్‌తో తన అనుబంధం ఎంతో మంచిగా ఉందన్నారు. ఆయనతో ఎటువంటి వివాదం లేదన్నారు. యూఎస్ టూర్‌కు తామిద్దరం కలిసి వెళ్లామని, తనకు వరుస ఈవెంట్స్ వల్ల చాలా అలసిపోయాయని చెప్వపారు.
నెట్‌ఫ్లిక్స్‌లో హానీసింగ్ డాక్యుమెంటరీ
అయితే తన మేనేజర్లకు చికాగో షోని క్యాన్సిల్ చేయాలని కోరానన్నారు. కానీ వారు అంగీకరించలేదన్నారు. అంతగా అలసిపోతున్న మరిన్ని ప్రదర్శనలు చేయడం అసాధ్యం అనిపించిందన్నారు. అదే సమయంలో తాను వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఒక వైపు జుట్టు కత్తిరించుకుని బయటకు వచ్చానన్నారు. తలపై కాఫీ మగ్‌ను కొట్టుకున్నానని, దాంతో తనకు గాయమైందన్నారు. 'షారుక్ తనపై దాడి చేశారన్నది పూర్తిగా అవాస్తమన్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని అర్థమైంది. ఇక డాక్యుమెంటరీ, హనీ సింగ్ జీవితాన్నీ వ్యక్తిగత అనుభవాలను తెలపనుంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.