
Tanushree Dutta : సొంత ఇంట్లోనే నాకు నరకం.. బోరున విలపించిన హీరోయిన్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొలిగిన తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకెక్కారు. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలిచిన ఆమె, 'ఆషిక్ బనాయా ఆప్నే' వంటి పాటలతో భారీ క్రేజ్ సంపాదించారు. 2005లో తెలుగులో 'వీరభద్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. అయితే 2013 తర్వాత తెరపై కన్పించకుండా పోయిన తనుశ్రీ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై సంచలన విషయాలను వెల్లడించారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేసిన తనుశ్రీ.. ఆరు సంవత్సరాలుగా తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని పేర్కొన్నారు. కన్నీళ్లు ముద్దయ్యేలా మాట్లాడుతూ - "నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.
Details
ఇంట్లో భద్రత లేదు
పోలీసులకు ఫోన్ చేశాను.. వారు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. బహుశా రేపో ఎల్లుండో స్టేషన్‌కు వెళ్తానని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, భద్రత లేకుండా పోయిందని, ఇల్లు చూసుకోవడం కూడా కష్టంగా మారిందని వాపోయారు. పనిమనిషిని పెట్టుకోలేకపోయానని, గతంలో వచ్చినవారు వస్తువులు దొంగిలించారని చెప్పారు. మరో వీడియోలో రాత్రిళ్లలో తన ఇంటి వెలుపల వినిపిస్తున్న శబ్దాలను రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. "ఈ శబ్దాలు నన్ను భయపెడుతున్నాయి.. ప్రశాంతంగా నిద్రపోవడం అసాధ్యమైపోయింది.
Details
మద్దతు పలికిన నెటిజన్లు
ఇది కూడా వేధింపులే" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోల నేపథ్యంలో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక మహిళ, ఒక నటికి సొంత ఇంట్లో భద్రత లేకపోవడం బాధాకరం, ఆమెకు తక్షణంగా సహాయం అందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనుశ్రీ దత్తా 2018లో బాలీవుడ్ 'మీటూ' ఉద్యమానికి నాంది పలికారు. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అయితే తర్వాత పటేకర్‌కు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించింది.