LOADING...
Oscar 2025: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన 'ఐ యామ్ స్టిల్ హియర్' 
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 'ఐ యామ్ స్టిల్ హియర్'

Oscar 2025: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన 'ఐ యామ్ స్టిల్ హియర్' 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకల్లో ఆస్కార్ ఒకటి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల విజేతలను ప్రకటించారు. అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోగా, మిక్కీ మాడిసన్ (అనోరా) ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. 'ఐయామ్ స్టిల్ హియర్' చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు లభించింది.

వివరాలు 

వాల్టర్ సల్లెస్ దర్శకత్వం వహించిన 'ఐయామ్ స్టిల్ హియర్' 

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న మొదటి బ్రెజిలియన్ సినిమా 'ఐ యామ్ స్టిల్ హియర్'. ఈ చిత్రం గతేడాది నవంబర్‌ 7న విడుదలైంది. వాల్టర్ సల్లెస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఫెర్నాండా టోర్రెస్, సెల్టన్ మెల్లో, ఫెర్నాండా మోంటెనెగ్రో నటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, 'ఐయామ్ స్టిల్ హియర్' ఫ్రాన్స్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చరిత్ర సృష్టించిన 'ఐయామ్ స్టిల్ హియర్'