Loading...
Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు: కిరణ్ అబ్బవరం
వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు: కిరణ్ అబ్బవరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించడమే కాకుండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రియాలిటీ'. దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమాలోని 'రుత్తూ' పాటను విడుదల చేసింది.

వివరాలు

'రుత్తూ' పాటను విడుదల చేసిన చిత్రబృందం

ఈ పాట విడుదల కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ దేవిక భట్, పూర్ణాచారి, నిర్మాత సుధాకర్, సనారే, విశ్వాస్ డానియల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న ఆదరణపై సంతోషం వ్యక్తం చేశారు.

వివరాలు

కుటుంబ ప్రేక్షకుల ప్రేమ మరువలేనిది

'నేను ఎక్కడికి వెళ్లినా.. నేను ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి.

ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, ఆదరణ దక్కింది. కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వెళ్లి చూడాలనే ఉద్దేశంతోనే ఈ కథ రాశాను.

రియాలిటీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా థియేటర్లకు వెళ్లండి. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు' అని కిరణ్ అబ్బవరం అన్నారు.

ఇప్పటికే సినిమాలోని 'భజగోవిందం' పాట ప్రేక్షకులకు బాగా నచ్చిందని, తాజాగా విడుదలైన 'రుత్తూ' పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్

కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న 'రియాలిటీ' సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది.

కిరణ్ అబ్బవరం నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

మరి డిసెంబర్ 25న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ADVERTISEMENT