NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Zarina Wahab: "ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలంటూ".. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    Zarina Wahab: "ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలంటూ".. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
    ప్రభాస్ పై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

    Zarina Wahab: "ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలంటూ".. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

    ఇప్పటికే సలార్, కల్కి వంటి పాన్ ఇండియా హిట్స్‌ అందించిన రెబల్ స్టార్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా చేస్తున్నారు.

    ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

    తాజాగా, ఈ సినిమా నుండి ఒక చిన్న పోస్టర్ గ్లింప్స్‌ విడుదల చేయగా, ఆ చిన్న వీడియోతో సినిమా గురించి అంచనాలు మరింత పెరిగాయి.

    అయితే, తాజాగా సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

    వివరాలు 

    ప్రభాస్సి నిమాలో భాగమై ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది: జరీనా 

    ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ, "వచ్చే జన్మలో ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

    ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జరీనా వహాబ్, రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ, "నేను ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో భాగమై ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ప్రభాస్ లాంటి గొప్ప వ్యక్తిని నేను ఇంకా ఎప్పుడూ చూడలేదు. ప్రభాస్ చాలా ప్రేమమయిన వ్యక్తి. అతనికి అసలు అహంకారం లేదు. నన్ను మాత్రమే కాదు, సెట్ లో ఉన్న అందరితో అలా వుంటాడు" అని చెప్పారు.

    వివరాలు 

    ఎవరైనా ఆకలితో ఉంటే, సెట్‌లోని వారందరికీ భోజనం అందిస్తాడు: జరీనా 

    జరీనా వహాబ్ కథనంలో, "ప్రభాస్ షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులందరితో కలిసి బాయ్‌ అని చెప్పి వెళ్లిపోతాడు.అతనికి అంత అవసరం ఏముంది.

    అంతే కాకుండా ఎవరైనా ఆకలితో ఉంటే, సెట్‌లోని వారందరికీ భోజనం అందిస్తాడు. ప్రభాస్ గురించి చెప్పాలంటే, మాటల్లో చెప్పడం కష్టం" అని ఆమె వివరించారు.

    ప్రభాస్ గురించి జరీనా వహాబ్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలు, ఆయన గొప్పతనాన్ని మరింత వెల్లడిస్తాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డార్లింగ్ పై సీనియర్ నటి ప్రశంసలు..

    I Want #PRABHAS as My SON - No SUPERSTAR is like him in the FILM Industry - #ZarinaWahab 🥵🥵🥵🔥🔥🔥pic.twitter.com/GDlsK9haUo

    — GetsCinema (@GetsCinema) November 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    ప్రభాస్

    Prabhas-Donation-Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షల విరాళం సలార్
    Kalki-Prabhas: గూజ్​ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్​ కల్కి టీజర్ కల్కి 2898 AD
    Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్ కల్కి 2898 AD
    Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'  కన్నప్ప
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025