
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీలో యాక్ట్ చేయను : కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా 'కె ర్యాంప్' సినిమాతో మంచి హిట్ సాధించిన కిరణ్, ఆ సినిమా ప్రమోషన్ల భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న కిరణ్, ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి తన అభిమానం వ్యక్తం చేశారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలపై కొంత షాకింగ్ కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, "నేను రచయిత కావాలనే ఉద్దేశంతోనే సినిమాల్లోకి వచ్చాను.
Details
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేను
థియేటర్లలో పవన్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాడ్ని. అనుకోకుండా నటుడిని అయ్యాను. ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేను, ఎందుకంటే హీరోగా నా కెరీర్‌ను ఇప్పుడిప్పుడే నిర్మించుకుంటున్నాను. కానీ, ఆ పాత్ర కిరణ్ అబ్బవరం తప్ప ఎవరూ చేయలేరు అనేలా ఉంటే మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. కిరణ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.