AA22xA6: బన్నీ బర్త్‌డే బ్లాస్ట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. 'AA22' టైటిల్ ఫిక్స్?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ప్రారంభించి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు,సినీ ప్రముఖులు భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ సంస్థ చేసిన ప్రత్యేక పోస్టు వైరల్ అవుతోంది. "సినిమా స్థాయిని మెల్లగా పెంచిన వ్యక్తి.. తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనిషి" అంటూ బన్నీని ప్రశంసించింది. ఈ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఫ్యాన్స్‌కు మేకర్స్ డబుల్ ట్రీట్ సిద్ధం చేశారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న బన్నీ 22వ చిత్రం (AA22xA6)కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా
దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్‌గా దీపికా పడుకోణె నటిస్తున్నారని సమాచారం. అలాగే బన్నీ తన కెరీర్‌లో తొలిసారిగా పలు పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే Pushpa 2: The Rule సినిమాతో రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీతో కలిసి మరో పాన్ ఇండియా స్థాయి విజువల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నారు.
వివరాలు
బన్నీ వరుస సినిమాలు
ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే కాకుండా సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్లతో కూడా బన్నీ వరుస సినిమాలు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇక Pushpa: The Rampage గురించి ఏదైనా అప్డేట్ వస్తుందా అన్న ఆసక్తితో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గీత ఆర్ట్స్ చేసిన ట్వీట్
The man who sets his own style 😎
— Geetha Arts (@GeethaArts) April 8, 2026
The man who quietly raised the bar for cinema…🔥🔥
Wishing our dearest, ICON STAR @alluarjun garu a very Happy Birthday! ❤️
Here’s to many more Iconic milestones ahead..❤️🔥❤️🔥❤️🔥#HappyBirthdayAlluArjun pic.twitter.com/cM6JVrYlv9