తదుపరి వార్తా కథనం

పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 21, 2023
12:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
అయితే తాజాగా పుష్ప 2 డైలాగ్ ని బన్నీ లీక్ చేసాడు. బేబి సినిమా అప్రిషియేషన్ మీట్ కి అతిథిగా వచ్చిన అల్లు అర్జున్, బేబీ సినిమా నటీనటులను, చిత్రబృందాన్ని ప్రశంసించారు.
ఈ క్రమంలో అభిమానులంతా పుష్ప 2 అప్డేట్ అంటూ గోల చేయడంతో, ఈడంతా ఒకటే రూల్ మీద జరుగుతా ఉండాది, పుష్ప గాడి రూల్ అని అభిమానుల్లో హుషారు నింపారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ డైలాగ్ వైరల్ గా మారిపోయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుష్ప 2 డైలాగ్ తో అభిమానుల్లో జోష్ నింపిన అల్లు అర్జున్
Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the stage.
— Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023
| #Pushpa2 | #PushpaTheRule | pic.twitter.com/QXbEaSnR7S