LOADING...
Game Changer: దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్‌' టీజర్‌.. క్లారిటీ ఇచ్చిన తమన్
దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్‌' టీజర్‌.. క్లారిటీ ఇచ్చిన తమన్

Game Changer: దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్‌' టీజర్‌.. క్లారిటీ ఇచ్చిన తమన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్‌' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ దసరాకు విడుదల అవుతుందని వార్తలు విన్పించాయి. కానీ సంగీత దర్శకుడు తమన్‌ ఈ వార్తలపై స్పందిస్తూ తాజా అప్డేట్‌ ఇచ్చారు. తమన్‌ తన సోషల్ మీడియాలో దసరాకు టీజర్‌ రాలేదని నిరాశ పడొద్దు ఫ్రెండ్స్‌. మా టీమ్‌ టీజర్‌పై పూర్తి దృష్టి పెట్టి పని చేస్తోందన్నారు. సీజీ, వీఎఫ్‌ఎక్స్‌, ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. దసరాకు కాకపోయినా, దీపావళికి టీజర్‌ ఖచ్చితంగా విడుదలవుతుందని ప్రకటించారు.

Details

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'గేమ్ ఛేంజర్'

అక్టోబర్‌ 30న సినిమా నుంచి ఒక లిరికల్‌ పాట విడుదలవుతుందని, డిసెంబర్‌ 20న సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 'రా మచ్చా' పాట ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్‌ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 'గేమ్‌ ఛేంజర్‌' కథ విషయానికొస్తే, ఇది పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె. సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర వంటి వారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.