LOADING...
భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్ 
రామ్ చరణ్ తో సినిమా చేయాలనుందని చెప్పిన మహతి స్వర సాగర్

భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 01, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి హీరోగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మణిశర్మ కొడుకు మ్యూజిక్ తో చిరంజీవి సినిమా వస్తోంది. అదే భోళాశంకర్. భోళాశంకర్ సినిమాకు మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆల్రెడీ రిలీజైన భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక, మిల్కీ బ్యూటీ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం భోళాశంకర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న మహతి స్వర సాగర్, భోళాశంకర్ సినిమా ప్రయాణంపై మాట్లాడుతూ, ఇంద్ర సినిమాలోని రాధే గోవింద పాటను రీమిక్స్ చేయాలనుందని తెలియజేసాడు. అయితే రాధే గోవింద పాటను రామ్ చరణ్ నటించే సినిమా కోసం మాత్రమే చేస్తానని మహతి స్వర సాగర్ అన్నారు.

Details

మ్యూజిక్ విషయంలో తండ్రి సలహాలు 

తనకు ఇంద్ర సినిమా అంటే చాలా ఇష్టమని, ఇప్పటికి 500సార్లు చూసానని అన్నాడు. మ్యూజిక్ విషయంలో తండ్రి చెప్పే సలహాల గురించి వెల్లడి చేసిన మహతి స్వర సాగర్, ఎలాంటి పాట చేసినా అందులో మెలోడీ ఉండేలా చూసుకోమని మణిశర్మ చెప్పారని అన్నారు. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా, ఆగస్టు 11వ తేదీన ప్రప్ంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.